విద్యకు ప్రభుత్వం పెద్ద పీట
కడప ముచ్చట్లు:
ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి పెద్ద పీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అల్మాస్ పేట లోని అల్మాస్ కళ్యాణ మండపము నందు అన్వర్ ఉల్ ఖురాన్ ఇంగ్లీష్ మీడియం, అరబిక్ మదరసా ముఫ్తి గౌస్ అహ్మద్ ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు ఆధునిక విద్య తో పాటు ఇస్లాం దైవ విద్యా బోధనను కూడా అభ్యసించాలని అన్నారు. ఆధునిక విద్య తమను ఉన్నత స్థాయి ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు ఇస్లాం దైవ విద్య బోధన తమ సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇస్లాం నియమ నిబంధనలు, ఆచారాలు, అలవాట్లు, ప్రవర్తనలు విద్యార్థినీ విద్యార్థులకు తెలియచెప్పారు. ముస్లిం మైనారిటీలు విద్యలో కొంత మేరకు వెనుకబడి ఉన్నారని, తప్పక ఆధునిక విద్య తో పాటు ఇస్లాం దైవ బోధనను కూడా తప్పక అభ్యసించాలని సూచించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడు ఉన్నత చదువు చదవాలనే ఉద్దేశంతో అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్య దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ పథకాలు మదరసాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరగా వెంటనే ఉత్తర్వులు జారీ చేసి అమలు చేయడం జరుగిందన్నారు ఈ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పక చదివించు కోవాలని,పిల్లలు కూడా తల్లిదండ్రు లకు, తాము చదువుతున్న విద్యాలయానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని హితవు పలికారుఈ కార్యక్ర మంలో అన్వర్ ఉల్ ఖురాన్ ఇంగ్లీష్ మీడియం, అరబిక్ మదరసా ముఫ్తి గౌస్ అహ్మద్, ఖాద్రి నిజామి, ముఫ్తి అజీమ్ అహమ్మద్, 30 వ డివిజన్ కార్పొరేటర్ షఫి అహ్మద్, అన్వర్ ఉల్ ఖురాన్ ఇంగ్లీష్ మీడియం, అరబిక్ మదరసా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Government is a big pillar of education
