Natyam ad

పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి

– రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషా

కడప ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసమే  అహర్నిశలు కృషి చేస్తున్నదని, లబ్ది పొంది ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు.
మంగళవారం నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ అరుణ ప్రభ, డివిజన్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలెంపల్లి, రుకావారిపల్లి ప్రాంతాల్లో 25 వ రోజున “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం ఎస్.బి. అంజాద్ బాషా కు మేళతాలలతో, బాణసంచతో ఘనంగా స్వాగతం పలికి, కార్యక్రమం గ్రామోత్సవంలా సాగిందిఈ సందర్భంగా  ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తోన్న  సంక్షేమ పథకాలు, సేవలు పట్ల లబ్ది దారుల మనోగతాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారిని కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన  బుక్ లెట్‌ను అంద‌జేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగాప్రజలకుచేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు.

 

 

 

కరోనా లాంటి ప్రపంచ విఫత్కర పరిస్థితుల్లో కూడా..  ప్రజలు ఏ మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో.. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని ప్రశంసించారు. అమ్మఒడి, వైయస్సార్ పింఛన్ కానుక, వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వాహనమిత్ర వైయస్సార్ వసది దీవెన, వైయస్సార్ విద్య దీవెన, పేదలందరికీ ఇల్లు వంటి సంక్షేమ పథకాలను లబ్దిదారులకు వివరిస్తూ… గడపగడపకు  ఆయన పర్యటన సాగింది.సండ్ర లక్ష్మీ దేవి అనే మహిళకు జగనన్న అమ్మఒడి, కి వైఎస్ ఆర్ పింఛన్ కానుక, వైఎస్ ఆర్ రైతు భరోసా,  వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ ఆర్ ఆసరా  పథకాల ద్వారా రూ.2 లక్షల , 500 లు లబ్ది కలిగిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలకాలం రుణ పడి ఉంటామని తెలిపారు.చంద్ర దేవి అనే మహిళ తనకు వైఎస్ ఆర్ సున్నా వడ్డీ, జగనన్న అమ్మఒడి, జగనన్న ఇంటి స్థలం, నిర్మాణానికి నగదుల ద్వారా రూ. 2 లక్షల, 94 వేల, 964 లు అందాయని, గతం లో ఏ ప్రభుత్వంలో ఈ విధంగా పథకాలు అందలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు 50 డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభ, డివిజన్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి,ఇతర నగర కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లు, డైరెక్టర్స్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Government is working tirelessly for the upliftment of poor people

Post Midle

Leave A Reply

Your email address will not be published.