Natyam ad

పుంగనూరులోని శాంతినగర్‌లో ప్రభుత్వ స్థలాలు విక్రయాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం పేద ప్రజలకు అందజేసిన స్థలాలను ఇద్దరు వ్యక్తులు కలసి విక్రయిస్తుండటంపై లబ్ధిదారులు తహశీల్ధార్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం లబ్ధిదారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపల్లె వద్ద గల శాంతినగర్‌లో గతంలో సుమారు 80 మందికి ప్లాట్లను కేటాయించారు. పేదరికంలో ఉన్న వారు ఇల్లు నిర్మించుకోలేక ప్రస్తుతం ఇండ్లు నిర్మించే ప్రయత్నం చేయడంతో వ్యాపారులు ఇద్దరు అడ్డుకోవడం , పట్టాలోని నిబంధనల మేరకు ఇండ్లు నిర్మించకపోవడంతో పట్టారద్దెయిందని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకొక్క పట్టాను సుమారు లక్షరూపాయలకు విక్రయిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Government land for sale in Shantinagar, Punganur