Date:16/01/2021
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రేటర్ హైదరాబాదు – ఇతర జిల్లా, పట్టణ కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములను, వివాదాస్పద భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని, ఇల్లు లేని పేదలకు 100 గజాల చొప్పున ఇళ్లపట్టాలు మంజూరు చేసి పంపిణీ చేయాలని, అలాగే ప్రభుత్వం అద్దె భవనాలలో నిర్వహిస్తున్న కాలేజీలను, ఎస్సీ/ఎస్టీ/బీసీ గురుకుల పాఠశాలలను, కాలేజీ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.కబ్జాలకు గురైనా ప్రభుత్వ భూములను సర్వే చేయించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు పట్టాలు పంచాలి. అలాగే వివాదాస్పదంగా ఉన్న భూములను ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకొని, స్వంత భవనాలు లేని 550 SC/ST/BC మైనార్టీ గురుకుల పాఠశాలలు, 480 కాలేజీ హాస్టళ్ళు నిర్మించాలని, లేకపోతే వేల కోట్ల విలువైన భూములను రాజకీయ నాయకులు, గూండాలు, సంఘం వ్యతిరేక శక్తులు కుమ్మక్కయి హత్యలు కిడ్నాపులు చేసుకుంటూ రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారన్నారు.ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లో ఉన్న భూములపై ప్రత్యేక విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆరు నెలలలో కేసులు పరిష్కరించాలని సూచించారు.న్యాయపరమైన – చట్టపరమైన కేసులలో ఉన్న భూముల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఈ ట్రిబ్యునల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ భూములు – వివాదాస్పద భూముల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Government lands should be taken over immediately – R. Krishnaiah’s letter