భారత ప్రభుత్వం సూచనలు

Date:10/05/2020

అమరావతి ముచ్చట్లు:

దేశం లో విధించబడిన లాక్ డౌన్ వలన ఇతర ప్రాంతాలలో చిక్కుకుని పోయిన వలస కార్మికులు,పర్యాటకులు ,విద్యార్ధులు మరియు ఇతరులను తమ స్వస్థలాలకు తిరిగి చేరుకోవడానికి

 

a. అన్నీ రాష్ట్రాలలోఉన్న నోడల్ అధికారులు చిక్కుపడిపోయిన వ్యక్తులను తిరిగి పంపించడానికి మరియు స్వీకరించడానికి ఒక ప్రామాణిక ప్రోటోకాల్ ను సిద్దం చేయాలి. మరియు అటువంటి వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి.

b. చిక్కుపడిపోయిన వ్యక్తుల సమూహాలు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలి వెళ్లే సమయం లో వారిని స్వీకరించడ, మరియు పంపించడం వంటి బాధ్యతలు ఇరు రాష్ట్రాల అధికారులుఒకరినొకరు సమన్వయం తో నిర్వహించాలి

c. తరలి వెళ్ళే వ్యక్తి లేదా వ్యక్తులను పూర్తిగా పరీక్షించిన పిమ్మట ఎలాంటి లక్షణాలు కనపడని వ్యక్తులు మాత్రమే తరలివేళ్ళుటకు అనుమతించాలి.

d. సమూహాలుగా లేదా గుంపులుగా తరలి వెళ్ళు వ్యక్తులు ను సూచించినా సురక్ష పద్దతులు అనుసరించి శానిటైజ్ చేయబడిన బస్సు లలో మరియు బస్సులో సీట్ల మద్య సామాజిక దూరం పాటిస్తూ చేసే ప్రయాణమునకు మాత్రమే అనుమతించబడతారు.

e. ప్రయాణ మార్గ మధ్యలో ఎదురయ్యే రాష్ట్రాలు అటువంటి వ్యక్తులను స్వీకరించే రాష్ట్రానికి ప్రయాణ అనుమతిని ఇస్తాయి

f. వ్యక్తులు వారి గమ్యం చేరిన తరువాత, ఆ వ్యక్తులను స్థానిక ఆరోగ్య అధికారులు పరీక్ష చేస్తారు మరియు ఇంటి నిర్బంధంలో ఉంచుతారు, వ్యక్తిని లేదా వ్యక్తులను సంస్థాగత నిర్బంధంలో ఉంచడానికిఅంచనా అనేది తప్పని సరిగా అవసరం.

మరియు వారి మొబైల్ లో ఆరోగ్య సేతూ అనే యాప్ ని ఇంస్టాల్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడూ గమనిస్తూ తగిన చర్యలు చేపడుతారు.

ఈ హోమ్ క్వారంటైన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర ఆరోగ్యశాఖ ద్వారా ది.11-03-2020 న విడుదల చేయబడిన నియమ నిబంధనలు లలో ఈ కింది లింక్ ద్వారా తెలుసుకొన వచ్చును.
https://www.mohfw.gov.in/pdf/Guidelinesforhomequarantine.pdf.

ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు

Tags: Government of India References

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *