రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిస్తున్న ప్రభుత్వం -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

నెల్లూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ, ఆధునిక సాంకేతిక పద్దతులు, పరిశోధనలు రైతులకు  అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని వివిధ  వ్యవసాయ కళాశాలలు,  వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో రూ. 36 కోట్లతో నిర్మించిన 13 నూతన భవనాలను బుధవారం   నెల్లూరులోని వరి పరిశోధనా స్థానము  నుంచి వర్చువల్ విధానంతో  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, యూనివర్సిటీ  ఉపకులపతి డా. విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబులతో కలసి ప్రారంభించారు.ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వలన  దేశంలో 31వ స్థానంలో వున్న ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం  11వ స్థానంనకు చేరుకుందని, రానున్న రోజుల్లో మొదటి స్థానాన్ని చేరుకునేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.  పరిశోధన, బోధనపై రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి సారించి  తక్కువ పెట్టుబడితో ఎక్కువ  దిగిబడి సాధించేలా రైతులకు అవసరమైన సాంకేతికతను,వంగడాలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

 

నూతన వంగడాల సృష్టిపై శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పంటల మార్పిడి విధానంతో రైతుకు, పొలానికి శ్రేయస్సు అని,  రైతుల్లో పంట మార్పిడి  విధానంపై  వ్యవసాయ అధికారులు రైతులను  ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు.ధాన్యం  కొనుగోళ్లు,  గిట్టుబాటు ధరల విషయంలో కొద్దిపాటి లోపాలను సరిదిద్ది రైతులకు మేలు చేసే కార్యక్రమాలు రాష్ట్ర  ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా అమలు చేస్తుందన్నారు.
రాష్ట్రంలో వైఎస్ కుటుంబానికి వ్యవసాయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉందని, వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి అమల్లోకి తెచ్చిన జలయజ్ఞం,నేడు నెల్లూరు జిల్లా నుంచి ఫలితాన్ని ఇవ్వబోతోందని, రాజు మంచి వాడైతే ప్రకృతి సహకరిస్తుంది అన్న పెద్దల మాటకు  వై.ఎస్.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిదర్శనమన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం రైతులకు చేయూతనందిస్తుందని మంత్రి తెలిపారు.చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

 

 

రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు  400 నుండి 500 కోట్ల రూపాయలు మేర  భారం పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఒక పక్క వినియోగదారునికి భారం పడకుండా మరో పక్క రైతు నష్ట పోకుండా  అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెలాఖారులో సంగం, నెల్లూరు బ్యారేజీలను  ముఖ్యమంత్రి  వై.ఎస్.  జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారని మంత్రి తెలిపారు.టమోటా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టామనిమంత్రి తెలిపారు.  రైతు సంక్షేమ పథకాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును తిరిగి 70 శాతం సబ్సిడీతో ప్రారంభించామని మంత్రి తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా 1 గోడౌన్ ను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు కట్టాల్సిన భీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తూ  రైతులకు  సాగు చేస్తున్న పంటకు భీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతు తన పంట నష్టపోతే,  సబ్సిడీ పై విత్తనాలు ఇవ్వడంతో పాటు ఆ పంట సీజన్ ల్లోనే పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ,  రాష్ట్రంలో 60 నుండి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులకు నాంధి పలుకుతూ, వ్యవసాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామంలో  రైతులకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా  రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు తో పాటు సాంకేతిక సలహాలు, సూచనలు ఆ గ్రామంలోనే అందిస్తున్నట్లు   కలెక్టర్ తెలిపారు.గత రబీ, ఖరీఫ్ సీజన్ లో  రైతుల వద్ద నుండి 6 లక్షల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేయడం జరిగిందని,  అలాగే, ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 30 గోడౌన్లు మంజూరు కాగా, పనులు పురోగతిలో వున్నాయని కలెక్టర్ తెలిపారు. మానవ మనుగడ కూడా  వ్యవసాయంతోనే ప్రారంభమైందన్నారు.కొత్త వరవడులకు శ్రీకారం చుట్టూతూ ఎన్నో ఆవిష్కరణలకు నాంధి పలుకుతూ విశ్వ విద్యాలయాలు ముందుకు పోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా  ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

 

 

ఈ సందర్భంగా ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి మాట్లాడుతూ,  ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని వివిధ  వ్యవసాయ కళాశాలలు,  వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో రూ. 36 కోట్లతో నిర్మించిన 13 నూతన భవనాలను వ్యవసాయ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతుల మీధుగా వర్చువల్ విధానంలో నెల్లూరు వరి పరిశోధనా స్థానము నుండి  ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు.  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి   రైతులకు అండగా వుంటూ  రైతుకు గిట్టు బాటు ధర కల్పించేలా కృషి చేయడం జరుగుచున్నదన్నారు. తక్కువపెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు  ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పద్ధతులపై, తెగుళ్ళను తట్టుకునే మేలురకం వంగడాలను కనుగొనేందులు  పరిశోధనలు చేస్తూ ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.

 

 

 

దేశ వ్యాప్తంగా వున్న  మొత్తం 79 విశ్వ విద్యాలయాల్లో  గతంలో  ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 31 స్థానంలో  వుండగా నేడు 11  స్థానంనకు చేరుకున్నదన్నారు.రాష్ట్రంలో  వ్యవసాయ రంగంలో డ్రోన్  సాంకేతికతను పెంపొందించే లా కృషి చేయడం జరుగుచున్నదని, అందులో భాగంగా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ విద్యార్ధులకు డ్రోన్ పైలెట్స్ గా శిక్షణ ఇవ్వడంతో పాటు రైతుల్లో కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఉప కులపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ డా. ఎల్. ప్రశాంతి, జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డా. యు. వినీత, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి  సుబ్బారెడ్డి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  మహేశ్వరుడు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు  అనిత, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Government providing modern technology to farmers – State Agriculture Minister Kakani

Leave A Reply

Your email address will not be published.