రేషన్ కార్డులను తగ్గిస్తున్న ప్రభుత్వం
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్రంలో 89 లక్షల కార్డ్ లకు ఉచిత రేషన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఎఫ్ ఎస్ ఏ కార్డులను తగ్గిస్తోందని,తెల్ల రేషన్ కార్డులను ఎన్ ఎఫ్ ఎస్ ఐ కార్డులుగా,ఎన్ ఎఫ్ ఎస్ ఐ కార్డ్ లను తెల్ల రేషన్ గా మార్చారని అన్నారు.వైసీపీ వారికి మాత్రమే ఉచిత బియ్యం అందుతున్నాయని,2023 మార్చి నాటికి ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి అవుతుందని,విశాఖ శ్రీకాకుళం విజయనగరం మరియు కొత్త జిల్లాలకు సంయుక్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు.అయితే బీజేపీ ఎమ్మెల్సీ అబ్యర్ధిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.వైసిపి ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద అరాచకం ఈ ఋషికొండ నిర్మాణాలని,ఋషికొండ లో ఏడు నక్షత్రాల స్థాయిలో 7 వేల చదరపు అడుగుల స్థలంలో ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం అవుతోందని,రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ కు నిధులకు లేవు అంటారు కానీ ఋషికొండ దగ్గర నిర్మాణం కు 165 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.రుషి కొండ ప్రాంతంలో ముఖ్య మంత్రి నివాసం నిర్మించే పనులు జరుగుతున్నాయని అన్నారు.
Tags: Government reducing ration cards