ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి

మర్రిపాడు ముచ్చట్లు:
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు బహిరంగ ప్రదేశాలలో తిరిగే ప్రజలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి  వ్యక్తిగత దూరం పాటిస్తూ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు ఆత్మకూరు ఎస్ఐ శివ శంకర్ రావు.. ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు మరియు గ్రామస్తులతో ఆయన అవగాహన కల్పిస్తూ కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు..తన వద్ద ఉన్న కొన్ని మాస్కులను స్థానిక ప్రజలకు అందజేశారు..మాస్క్ లు దరించని ప్రజలకు, వాహనదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిగా జరిమానా విధించడం జరుగుతుంది… కావున ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి కరోనా ని పారద్రోలే నిమిత్తం మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని పోలీస్ వారి విజ్ఞప్తి అంటూ ఎస్ ఐ ఎం. శివ శంకర్ రావు తెలిపారు.. ఎస్ ఐ వెంట వారి సిబ్బంది హాజరయ్యారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Government regulations must be strictly adhered to

Natyam ad