Natyam ad

అర్హత ఉన్న ప్రతి ఇంటి ముంగిటకే ప్రభుత్వ పథకాలు

— ఆదర్శవంతంగా సచివాలయ వ్యవస్థ
— అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్లవిద్య
— అభివృద్దిపనులను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చౌడేపల్లె ముచ్చట్లు:


అర్హత ఉన్న ప్రతి ఇంటి ముంగిటకే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా చేరుతున్నాయని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం చౌడేపల్లె మండలంలోని గడ్డంవారిపల్లె సచివాలయ భవనం, రైతు భరోసాకేంద్రాలను , వీటితోపాటు గడ్డంవారిపల్లె,చిన్నకంపల్లెలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తమ పార్టీకు ఓటు వేయకుండా ఉన్నవారికి సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల్లో లబ్దిపొందుతున్నారని గుర్తుచేశారు. పార్టీలకు, కుల మతాలకుఅతీతంగా పాలన సాగిస్తూ పొరుగుర్ఖా•లు మన రాష్ట్రంలో అమలుచేస్తున్న విధానాలు, పథకాలను పరిశీలించి్య అధ్యయనం చేసి అభినందిస్తున్నారన్నారు. ఇదే త రహాలో ఆయా ర్ఖా•ల్లో అమలుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.రైతు భరోసాకేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతోపాటు సస్యరక్షణ మందులు, సలహాలు సిబ్బంది ద్వారా అందిస్తూ కొత్త పద్దతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్లభోదన తోపాటు సులభమైన పద్దతులో విద్యాభోదన,నాణ్యమైన పౌష్టిక ఆహారం పంపిణీ, చేస్తున్నట్లు చెప్పారు. గర్భవతులనుంచి బాలింతలు, పుట్టిన బిడ్డనుంచి ఐదేళ్లలోపు గల పిల్లల సంరక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వీటిని అర్హత ఉన్న ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలు లేకుండా ఎలాంటి అర్జీలు ఇవ్వని పాలన గ్రామాల్లో సచివాలయాల ద్వారా రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

 

Post Midle

రఘునాథరెడ్డికు పరామర్శ……

పరికిదొన పంచాయతీ చినకంపల్లెలో పార్టీ నాయకుడు రాఘునాథరెడ్డిను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి అవరసరమైన వైద్య సదుపాయాలతోపాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ కుటుంభానికి ఏ ఆపదొచ్చినా అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పివైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి,వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్‌, వెంకటరెడ్డి, సర్పంచ్‌లు భాగ్యవతి, లక్ష్మిదేవి,ఎంపీటిసీ శ్రీరాములు,పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌ కళ్యాణ్‌భరత్‌,డిసిసిబి డైరక్టర్‌ రమేష్‌బాబు, పాల ఏకరి రాష్ట్ర డైరక్టర్‌ లడ్డూరమణ, నేతలు బాబు,పెద్దరెడ్డప్పరెడ్డి, ఈశ్వరయ్య, వెంకటరెడ్డి, చలపతినాయుడు,మోహన్‌రెడ్డి, గిరిబాబు, సుబ్బారెడ్డి,నాగభూషణరెడ్డి, తదితరులున్నారు.

Tags: Government schemes at the doorstep of every eligible household

Post Midle

Leave A Reply

Your email address will not be published.