Natyam ad

పుంగనూరులో పేదలందరికి ప్రభుత్వ పథకాలు- చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని 31 వార్డులోని అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని, వీటిని గుర్తించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ కలసి గడప గడపకు వెళ్లారు. పట్టణంలోని తాటిమాకులపాళ్యెం , కోర్టు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇంటింటి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాటిమాకులపాళ్యెం ఏటిపక్క నివాసం ఉన్న ప్రజలు విద్యుత్‌ లైన్లు, చింతచెట్ల కారణంగా ప్రమాదాలు జరుగుతోందని తెలిపారు. దీనిపై మంత్రి పీఏ చంద్రహాస్‌ విద్యుత్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే చెట్లు తొలగించి, లైన్లు మార్చాలని సూచించారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సమస్యలపై నివేదికలు సిద్దం చేస్తున్నామన్నారు. పర్యటనలో వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. అలాగే అర్హులైన పేదలు ఎవరైనా ఉంటే వారికి సంక్షేమ పథ కాలు అందించేలా నివేదికలు సిద్దం చేస్తున్నామన్నారు. సమస్యలు లేని మున్సిపాలిటిగా చేపట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు త్యాగరాజు, నటరాజ, అమ్ము, కాంతమ్మ, రెడ్డెమ్మ, నరసింహులు, కిజర్‌ఖాన్‌, కాళిదాసు, జెపి.యాదవ్‌, రాఘవేంద్ర, రేష్మా, ఆదిలక్ష్మీ, భారతి, విజయభారతి, సాజిదా, నయీంతాజ్‌, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Government schemes for all the poor in Punganur- Chairman Aleem Basha

Post Midle