అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలి

–  జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన

Date:15/07/2019

పెద్దపల్లి ముచ్చట్లు:

అర్హులైన  ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందించాలని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన సంబంధిత  అధికారులను ఆదేశించారు.    కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి (54) వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ది కొరకు అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్క అర్హుడుకి పథకాల
ఫలితాలు అందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో  హరితహారం  కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖలు తమ లక్ష్యాలను చేరుకోవాలని, అధికారులు ఉద్యోగులు  హరితహారం

 

 

 

కార్యక్రమంలో పాల్గోని పచ్చదనం పెంపొందించడానికి కృషి  చేయాలని, మొక్కలను నాటడానికి  సంరక్షించడానికి విద్యార్థులు,  ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.   ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని ఆదేశించారు.    ఎలిగేడు మండలం ఎలిగేడు గ్రామానికి చెందిన కవ్వంపల్లి సంపత్  తఃమైసయ్య తాను ఐటిఐ( ఎలక్ట్రిసియన్)  మరియు డిగ్రీ పూర్తి చేసానని,  స్వయం ఉపాధి కింద    కిరాణా షాపు ఎర్పాటుచేసుకొనుటకు  ఎస్సి  కార్పోరేషన్ రుణాలు అందించుటకు దరఖాస్తు  చేసుకున్నానని, తనకు  ఎస్సి  కార్పోరేషన్  కింద  రుణం మంజూరు చేయించవలసిందిగా  కోరగా, ఈడి ఎస్సి  కార్పోరేషన్  కు

 

 

 

 

వ్రాస్తు అర్హత మేరకు  సమస్య  పరిష్కరించవలసిందిగా ఆదేశించారు.
కమాన్ పూర్ మండలం ముల్కపల్లి గ్రామ శివారున ఉన్న భూమి సర్వే నెం. 82,84,85  లో గల 21 ఎకరాల 24 గుంటల భూమి  సంబంధించి పూర్తి యజమాన్యుల  హక్కులు కల్గించి  పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాల్సిందిగా  సదరు యజమాన్యులు  కోరగా కమాన్ పూర్  తహసిల్దార్ కు వ్రాస్తు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఆదేశించారు.

 

 

 

 

ఎలిగేడు మండలం ముప్పిరిపేట గ్రామానికి చెందిన  దూట మల్లేశం తః భూమయ్య  సర్వే నెం.295/5లో 1 ఎకరం 39 గుంటలు  భూమి తమకు ఇప్పించవలసిందిగా కోరగా,  ఎలిగేడు తహసిల్దార్ కు వ్రాస్తూ  సంబంధిత విషయం పై పూర్తి విచారణ చేపట్టి  అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించారు.గోదావరిఖనికి చెందిన  ట్రాక్టర్స్  ఓనర్స్ అసోసియెషన్  వారు  ఇస్సుక రీచ్ లలో  తాము పనిచేస్తున్నామని,  తమకు ట్రిపుకి  రూ.1500/- తక్కువగా ఉన్న వాటిని రూ.1500/-  పెంచాలని, అదే విధంగా  మిగిలిన  ప్రతి ట్రిప్ కు కనీసం రూ.350/-  పెంచాలని  కోరగా,   మైనింగ్ శాఖ ఎడికి వ్రాస్తు దీనిని పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని ఆదేశించారు.

 

 

 

 

పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన తొకల లింగయ్య తః తొకల పోచ  తాను ఎస్సి కులముకు చెందిన వాడినని, ఎస్సి  కార్పోరేషన్ లో టెంట్  హౌజ్ దరఖాస్తు  చేసుకున్నానని,  నా  సర్టిఫికేట్స్ ను పరిశీలించి రుణం మంజూరు చేయాల్సిందిగా  కోరగా ఈడి ఎస్సి  కార్పోరేషన్ కు వ్రాస్తు  అర్హత మేరకు  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి,  జిల్లా ఇంచార్జి డిఆర్వో  కె.నరసింహమూర్తి,  కలెక్టరేట్ ఎఒ రాజేశ్వర్ రావు, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

 

క్రీడాభిమానుల‌కు క్రీడ‌లు మ‌రింత చేరువ 

Tags: Government schemes should be provided for the eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *