కార్పొరేట్ స్కూల్ ను తలపిస్తున్న సర్కారీ బడి

కరీంనగర్  ముచ్చట్లు:

జన్మనిచ్చిన తల్లి ఋణం, పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అంటుంటారు, కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అందులో భాగంగానే మాజీ న్యాయవది, మంత్రి చెల్మెడ ఆనందరావు తను పుట్టి పెరిగిన ఊరు కోనరావుపేట మండల కేంద్రంలోని మల్కపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “మన ఊరు మన బడి” కార్యక్రమంలో భాగంగా మంత్రి కె. తారక రామారావు పిలుపు మేరకు చల్మెడ ఆనందరావు కోటిన్నర రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవనం  ప్రారంభానికి ముస్తాబైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మాల్కపేట చల్మేడ ఆనందరావు స్వంత గ్రామంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కోటిన్నర రూపాయలతో ఆనందరావు తన తల్లి జానకి దేవి జ్ఞాపకర్థం ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. నిరుపేద కుటుంబాలలో అక్షర వెలుగులు నింపడానికి కోటి యాభై లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నాడు పనులు పూర్తికావడంతో  ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పలుమార్లు మల్కపేట గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల పనుల పురోగతిని పర్యవేక్షించారు.సకల హంగులతో అన్ని సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య సర్కారు పాఠశాల భవనాన్ని నిర్మించారు.

 

 

విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ విశాలమైన తరగతి గదులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో తరగతి గదిలో 80 మంది విద్యార్థులు కూర్చొని విద్యనభ్యసించేలా ఎనిమిది గదులను నిర్మించారు. అంతేకాకుండా విద్యార్థులకు డిజిటల్‌ బోధనకు ప్రొజెక్టర్స్‌, కంప్యూటర్లు, డెస్క్‌ బెంచీలు, ఫర్నిచర్‌, క్రీడా సామగ్రి, మోడ్రన్‌ మూత్రశాలలు, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక వంటగది, విద్యుత్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులను స్కూల్ ఆకర్షించేలా తరగతి గదులు, వరండాలో విద్యకు సంబంధించిన బొమ్మలను వేయించారు.ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులను కల్పించేందుకు ప్రభుత్వం స్కూళ్లను బలోపేతం చేసే ఉద్దేశ్యంతో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా సొంత ఖర్చులతో మల్కపేట గ్రామంలో నిర్మించిన చల్మెడ జానకీదేవి పాఠశాలనే రాష్ట్రంలోనే ప్రథమంగా నిలువనున్నది. 2021 జూలై 1 న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తోపాటు చల్మెడ ఆనందరావు, వారి కుమారుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే పాఠశాల నిర్మాణం పూర్తి చేశారు.

 

Tags: Government school looking for a corporate school

Leave A Reply

Your email address will not be published.