సర్కారి బడులు శిధిలావస్థలో వున్నాయి
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా కుంటాల మండలం, లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బండి సంజయ్ గురువారం సందర్శించారు. అక్కడ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను పాఠశాల ఉపాధ్యాయులు అయన దృష్టికి తెచ్చారు. చిన్నారి విద్యార్థులను మీరేమీ అవుదాం అనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. నేను కలెక్టర్ ను, నేను డాక్టర్ ను అవుతానని చిన్నారులు చెప్పారు. ఉపాధ్యాయుల కొరతపై అయన ఆరా తీసారు. ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో… కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంటూ విమర్శించారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Tags: Government schools are dilapidated

