గ్రామీణరైతుల ముంగిటకే ప్రభుత్వ సేవలు- మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

-రూ.329 కోట్లతో10408 ఆర్‌బికేల నిర్మాణాలు
– దేశ చరిత్రలో వినూత్న ్య అధ్యాయం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

భారత దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల ముంగిటకు ప్రభుత్వ సేవలను అందిస్తూ రైతు భరోసా క్యేద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.ఆయన తొలుత రాజన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సుగాలిమిట్టలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.అలాగే రైతులతో కలిసి ఎద్దుల బండిపై గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతం పైగా రైతులు ఉండడ ంతో , రైతు పక్షపాతి గా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. రూ:329.83 కోట్ల10408 రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం జరుగుతోందన్నారు. సుమారు సగానికి పైగా నిర్మాణాలను పూర్తిచేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చే ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ, ఆర్‌బికేల ఏర్పాటు, బల్క్మిల్క్ కూలింగ్‌ యూనిట్లు ,ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అలాగే సచివాలయాల వద్ద విలేజ్‌ హెల్త్ సెంటర్‌లను ఏర్పాటుచేశామన్నారు. వీటితో పాటు రెండు మూడు పంచాయతీలకు కలిపి గిడ్డంగులను ఏర్పాటుచేస్తున్నామనితెలిపారు.

 

 

 

 

ఆర్‌బికెలలో రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలందిస్తూ ఎప్పటికప్పుడు రైతులకు, పంటలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి , పరీక్షల అనంతరం ఆపొలాల్లో ఏ పంట సాగుచేయడానికి అనువుగా ఉంటుందో , ఆపంటకు సంబందించి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరాచేస్తామన్నారు. అలాగే రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, రాయితీ ధరలతో సరఫరాకు చర్యలుతీసుకొంటున్నట్లు తెలిపారు.అలాగే జలయజ్ఖం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని అభివర్ణించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌,పెద్దిరెడ్డి, అక్కిసానిభాస్కర్‌రెడ్డి,కొండ వీటి నాగభూషణం, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ స్టేట్‌ కౌన్సిలర్‌ విశ్వనాథ్‌, వైఎస్స్రార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరూపాక్షి జయచంద్రారెడ్డి, జెసీ రాజశేఖర్‌, జెడి దొరస్వామి,పిడీలు చంద్రశేఖర్‌, తులసి, జెడ్పిసీఈఓ ప్రభాకర్‌రెడ్డి,్య్య ధ్యానవనశాఖ డిడి శ్రీనివాసరావు, ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి లు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Government services ahead of rural farmers – Minister Peddireddy revealed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *