బాధితులకు అండగా ప్రభుత్వం

Date:11/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

గోడకూలిన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గోల్నాకలోని పెరల్ గార్డెన్స్ లో ఆదివారం గోడకూలి నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.  సోమావారం మంత్రి సంఘటనా స్థలాన్ని అంబర్ పేట్ ఏమ్మేల్యే కాలేరు వెంకటేష్ తో కలసి పరిశీలించారు. ప్రమాదం కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున జీహెచ్ ఎంసి తరపున ప్రకటించడం జరిగిందని, గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని చెప్పారు. మృతల కుటుంబాలకు మరింత సాయం అందించేందుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఖర్చులతోనే వారి స్వగ్రామాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుడు పరారీలో ఉన్నాడని, అతని పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని  ఆయన స్పష్టం చేశారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు ఉన్నారు.

 

బాలికల వసతి గృహంపై ఏసీబీ దాడులు

 

Tags:Government to support victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *