త్వరలో సర్కారీ వెంచర్లు
మెదక్ ముచ్చట్లు:
పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ ఏమూలకూ సరిపోక దిక్కులుచూస్తున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇకపై సొంత ఆదాయమార్గాలు వెతుక్కోవాలని రాష్ట్ర సర్కారు తేల్చి చెప్తున్నది. సిటీలు, టౌన్ల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను వెంచర్లు చేసి అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కంతో డెవలప్ చేసుకోవాలని సూచిస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (యూడీఏ)లుగా మారుస్తున్నది. యూడీఏల పరిధిలో ఇప్పటికే చేపట్టిన రియల్ ఎస్టేట్బిజినెస్ను మిగిలిన పట్టణాలకూ విస్తరించాలని నిర్ణయించింది. అయితే.. వరంగల్‌లోని ‘కుడా’లో తప్ప మిగిలిన చోట్ల ఈ ‘రియల్ఎస్టేట్ ఫార్ములా’ పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తేలడంతో తాజాగా ప్రభుత్వం రూట్మార్చింది. సర్కారు జాగలు లేని చోట ల్యాండ్ పూలింగ్ కింద ప్రైవేట్ భూములను సేకరించి వెంచర్లు చేయాలని, వీలైతే టౌన్‌షిప్‌లు కట్టి అమ్మాలని ఇటీవల నల్గొండలో మంత్రి కేటీఆర్ఆదేశించారు. దీంతో ఆఫీసర్లంతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అసలు పనులు పక్కనపెట్టి భూములు సేకరించే పనిలో పడ్డారు.
అంటే సగటున ఒక్కో అర్బన్లోకల్బాడీ( యూఎల్బీ)కి రూ. కోటి కూడా రావడం లేదు. ప్రాపర్టీ టాక్సెస్ కూడా ఆశించిన స్థాయిలో వసూలు కావట్లేదు. దీంతో సరిపడా ఫండ్స్ లేక నగరాలు, పట్టణాల్లో మౌలికవసతుల సమస్య వేధిస్తున్నది. ఏండ్లు గడుస్తున్నా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటర్నల్ రోడ్లు, నాలాల విస్తరణ పూర్తికాక పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వకాలతో దెబ్బతిన్న రోడ్లను కూడా రిపేర్ చేయించలేని పరిస్థితి ఉంది. ఇక శివారు కాలనీలు, విలీన పంచాయతీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షం వస్తే కాలనీలు నీటమునుగుతున్నాయి. కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, ఇతర మున్సిపాలిటీల్లో బ్యూటిఫికేషన్వర్క్స్కింద మొదలుపెట్టిన డివైడర్లు, సర్కిళ్ల డెవలప్మెంట్, పార్కులు, ట్యాంక్బండ్స్ లాంటి పనులు ఏండ్లు గడుస్తున్నా కంప్లీట్ అయితలేవు. వరంగల్‌లో సక్సెస్అయిన ‘రియల్ ఎస్టేట్’ ఫార్ములా మిగిలిన యూడీఏలలో పెద్దగా సక్సెస్ కాలేదు. సర్కారు భూములు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో సర్కారు జాగలు లేని చోట ల్యాండ్‌పూలింగ్ కింద ప్రైవేట్ భూములైనా సేకరించి, వెంచర్లు, అవసరమైతే టౌన్‌షిప్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు ల్యాండ్సెర్చింగ్లో పడ్డారు. ఒకేచోట కనీసం 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే సొంతంగావెంచర్ఏర్పాటు కోసం పైకి ప్రపోజల్స్ పంపుతున్నారు. అంతకంటే తక్కువ ఉన్నచోట పక్కనే ఉన్న ప్రైవేట్ల్యాండ్స్ సేకరించేందుకు యజమానులతో మాట్లాడుతున్నారు. సిద్దిపేట అర్బన్
కాగా, నల్గొండ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు లేకపోవడంతో ల్యాండ్‌పూలింగ్ కింద ప్రైవేట్ భూములు సేకరించేందుకు అక్కడి ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. మొత్తంమీద ప్రభుత్వ భూములను అమ్మయినా పట్టణాలను డెవలప్ చేసుకోవాలని చెప్పడమంటే సర్కారుకు ఇక ముందు కూడా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఫండ్స్ పెంచే ఆలోచన లేనట్లేనని కమిషనర్లు చెప్తున్నారు. ఈలెక్కన రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యూడీఏలు ఏర్పాటుచేసే అవకాశముందంటున్నారు. ఇలా జాగలన్నింటినీ అమ్మేస్తే భవిష్యత్‌లో సర్కారు అవసరాలకు ఇబ్బందులు తప్పవని ఆఫీసర్లు, ఎక్స్పర్ట్స్ అంటున్నారు.రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద సర్కారు ఇస్తున్న ఫండ్స్ ఏమూలకూ చాలడం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్రం ఇచ్చే స్టేట్ఫైనాన్స్కమిషన్ ఫండ్స్‌ను కలిపి పట్టణ ప్రగతి కింద 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ.145 కోట్ల ఇస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ అమలుచేసి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు 1975 నుంచే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదట హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా– ప్రస్తుత హెచ్ఎండీఏ), ఆ తర్వాత కులీ కుతుబ్‌షా(1981), కాకతీయ (1982) ఏర్పాటయ్యాయి. రాష్ట్రం వచ్చాక నిజామాబాద్, శాతావాహన (కరీంనగర్), సిద్దిపేట, స్తంభాద్రి (ఖమ్మం) పేర్లతో అథారిటీలు ఏర్పాటు చేశారు. మెదక్‌లో ముడా, జనగామ, జగిత్యాలలో జుడా ఏర్పాటు ప్రపోజల్స్ సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా నల్గొండలో నుడా( నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు. హెచ్ఎండీఏ తప్ప మిగిలిన అథారిటీలన్నీ ఫండ్స్ లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా మాస్టర్‌ప్లాన్ లక్ష్యాలు నెరవేరట్లేదు. దీంతో సర్కారు కొన్నేండ్లుగా యూడీఏలను రియల్ ఎస్టేట్‌వైపు ప్రోత్సహిస్తున్నది. ఈ దిశగా హెచ్ఎండీఏతో పాటు వరంగల్‌లోని కుడా మాత్రమే కొంత సక్సెస్ అయ్యాయి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Government ventures soon