Natyam ad

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గీతాలాపన చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే,డాక్టర్ *గువ్వల బాలరాజుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు నా యొక్క సెల్యూట్ అని, వారి స్ఫూర్తి దేశ ప్రజలలో ఎప్పుడు ఉంటుందని తెలిపారు.కొట్లాడిసాధించిన తెలంగాణకు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడంతో అనతి కాలంలోనే అనేక రంగాలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ, అభివృద్దిపథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ ఖ్యాతి సిఎం కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆర్థిక రంగంలో మొదటి స్థానంలోనిలిచిందని ఆరోగ్య సూచిలో నంబర్ వన్ గా ఉందన్నారు. ఆహార ధాన్యాల ఎగుమతిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందనీ, కులవృత్తులకు ప్రాణం పోసిన రాష్ట్రాలో మొడటి స్థానంలో ఉందని,వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిక రాష్ట్రంగా ఉందనీ పేర్కోన్నారు. పదేండ్ల పాలలో పదిజిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చిందని,తెలంగాణ పాలన వైభవానికి ప్రతీక రాష్ట్ర సచివాలయాన్ని గొప్పగా నిర్మిందని, ప్రతి జిల్లాకు అన్ని హంగులతో కూడిన కలెక్టర్, పోలీసు కార్యాలయాలను అత్యంత అధునాతనంగా తెలంగాణ ప్రభుత్వం

 

 

Post Midle

ఏర్పాటు చేసిందని వివరించారు. పల్లే ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి విన్నుత పథకలతో రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా, పర్యావరణంగా పర్థశుభ్రతకు చిరునామగా, మౌలిక సదుపాయాల కల్పనలోకేంద్రం బిందువుగా ఉందని తెలిపారు. ఆరోగ్య రంగంలో అద్భుతాలు సృష్టించిందని, జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారేనని, రాష్ట్ర రాజధానిలో నలుదిక్కుల నాలుగుఅదునాతన ఆసుపత్రులకు కు నాంది పలికిందన్నారు.అంతకముందు భారీ జాతీయ పతాకంతో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అరుణ, ఎంపీపీ శ్రీమతి శాంతభాయిలోక్యనాయక్, పిఎసిఎస్ ఛైర్మెన్ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పర్వతాలు ముదిరాజ్, మున్సిపల్వైస్ చైర్మన్  శైలజావిష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Government Whip, MLA, Dr. Guvvala Balaraju unfurled the national flag at the MLA camp office

Post Midle