రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సబ్సిడీ ధరలపై జనుము, జీలగ విత్తనాలు పంపిణీ.రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.మంగళవారం సత్యవేడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం జనుము, జీలగ విత్తనాల బ్యాగులను రైతులకు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పంటల సాగులో రైతులకు అవసరమైన విత్తనాలను,ఎరువులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఇప్పటికే పంట పెట్టుబడును గాను రైతులకు ప్రతి ఏడాది 20 వేల రూపాయలను అందించాలన్న ఎన్నికల హామీ త్వరలో అమలు చేయడానికి కసరత్తు జరుగుతుందన్నారు.తద్వారా ఏ రైతు కూడా పంట సాగులో నష్టపోకూడదు అన్నదే ప్రభుత్వ ఆశయం అన్నారు.వ్యవసాయ శాఖ ఏవో మురళి మాట్లాడుతూ పచ్చరొట్టె విత్తన పంపిణీలో భాగంగా జనుము,జీలగ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నామన్నారు.ఈ నేపథ్యంలో సబ్సిడీ పోను 10 కేజీల బ్యాగు 440 రైతులు చెల్లించాల్సిందన్నారు.మండలానికి జీలగ విత్తనాలు 130 క్వింటాళ్లు,జనుము 75 క్వింటాళ్లు ప్రభుత్వ కేటాయించింది అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పరమశివం ( భాష), మురళి ( కోళ్ల చిన్న) నారాయణ, జనసేన బాలమురళీకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడి సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో చంద్రశేఖర్, గ్రామీణ వ్యవసాయ అసిస్టెంట్లు స్వర్ణలత, పూర్ణచంద్ర, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Government’s aim is to improve farmers

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *