కడప జిల్లా అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పెండింగ్ పనులు పూర్తి చేసేందుకుగాను కృషి
ప్రజలకు అన్నివిధాలా మేలు చేకూర్చేలా కృషిచేస్తున్నాం
జెడ్పి చైర్మన్ ఆకేపాటి
అమరనాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం.. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల మొట్టమొదటి ఉమ్మడి జెడ్పి సమీక్షా సమావేశం

కడప ముచ్చట్లు:

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో.. జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూర్చే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని.. జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు లు సంయుక్తంగా పేర్కొన్నారు.
సోమవారం ఉదయం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో.. జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్, అన్నమయ్య  ఉమ్మడి జిల్లాల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి.. గౌరవ అధ్యక్షులుగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, జేసీ సీఎం సాయికాంత్ వర్మ, అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరు కాగా.. ఎమ్మెల్సీలు బిటెక్ రవి, శివనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. దాసరి సుధా, రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

 

 

సమావేశం ప్రారంభంలో తొలుత జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ప్రారంభోపన్యాస చేసి.. అనంతరం మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా, రూపొందించడానికి జిల్లా ప్రజా పరిషత్ ద్వారా కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రజా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ జిల్లా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించి ప్రగతిపథంలో పయనించేలా.. శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా.. నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో.. శాఖల వారీగా అన్ని రకాల అభివృద్ధి పథకాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా ఉమ్మడి జిల్లాల పరిషత్ పరిధిలో  అన్ని రకాలుగా అభివృద్ధి కార్యాచరణ జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతతో, కార్యదీక్షతో, చిత్త శుద్దితో పనిచేయాలని కోరారు. అలాగే జెడ్పి శవ సభ్య సమావేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళపై సభ్యులు లేవనెత్తిన పలు అంశాల పైన అధికారులను వివరణ కోరారు. అందులో భాగంగా రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్) అందించడం నిజంగా గొప్ప విషయం అన్నారు.  వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ… జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పలువురు జడ్పిటిసి, ఎంపిటిసి లు లేవనెత్తిన పలు ప్రభుత్వ ఫిర్యాదులపై    వచ్చే సర్వసభ్య సమావేశంలో ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని సభాముఖంగా వివరించారు. అలాగే ప్రజాప్రతినిధులు సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకొని వస్తే వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడు తూ.. జిల్లాలో వ్యవసాయ సలహామండలి ఆద్వర్యం లో ఆర్బికే లలో ప్రతినెల మొదటి శుక్రవారం మండల స్థాయిలో రెండవ శుక్రవారం జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం, వ్యవసాయ అనుబంధ శాఖలతో రైతుల ఆదాయం పెంచే దిశగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. అనంతరం అజెండా అంశాల వారీగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను సమర్పించారు.

 

Tags: Government’s mission is to develop Kadapa district

Leave A Reply

Your email address will not be published.