మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం
చంఢీగఢ్ ముచ్చట్లు:
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తి చేసారు. కుంజా సత్యవతి నీతి నిజాయితీతో రాజకీయాల్లో అంకిత భావంతో నిరుపేద,బడుగు బలహీనవర్గాల కోసం ప్రత్యేకంగా గిరిజనుల సమస్యల పై నిరంతరం పోరాడిన నాయకురాలని, జాతీయ భావాలతో పేద ప్రజల సేవనే లక్ష్యంగా వారు పనిచేశారని, వారు తనకు అత్యంత ఆత్మీ ఆమె సేవలను బండారు దత్తాత్రేయఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కుంజా సత్యవతి రి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు తట్టుకోవడానికి శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.
Tags: Governor Bandaru Dattatreya condoles death of former MLA Kunja Satyavati

