గవర్నర్ ను అవమానించారు-బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం దర్శించుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక సిస్టం లేదు. సీఎం ముందే నిధులు ఇచ్చి ఉంటే అన్ని పనులు సౌకర్యాలు కల్పించే వారు. తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో గవర్నర్ ఉంటారు. గవర్నర్ ను అవమానించడం దారుణం. ఆహ్వానించక పోవడం సరైంది కాదు. గవర్నర్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను పిలవక పోవడానికి కారణం ఎంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి. రాజ్యాంగ బద్ధంగా ప్రవర్తించాలి. లేకపోతే ప్రజలు తిరగబడతారని అన్నారు.
Tags; Governor insulted-Bandi Sanjay