పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

హైద‌రాబాద్  ముచ్చట్లు :
మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్ ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ స‌భ్యులు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. పీవీ మార్గ్‌లోని జ్ఞాన‌భూమిలో శ‌త‌జ‌యంతి ముగింపు ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Governor Tamilisai unveils statue of Peevi Narasimha Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *