Natyam ad

స్వామి అమ్మవార్ల సేవలో గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్

-స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్

శ్రీశైలం ముచ్చట్లు :


సోమవారం రోజు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్  దంపతులు ఆలయం వద్దకు  ఉదయం చేరుకున్నారు. గంగాధర మండపం వద్ద రాష్ట్ర గవర్నర్ కి, వారి ధర్మపత్ని సుప్రభ హరిచందన్, వారి కుమారుడు ప్రశంజిత్ హరిచందన్, వారి కోడలు సరోజిని హరిచందన్ లకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం రత్నగర్భగణపతిస్వామి వారిని  దర్శించుకుని హారతిని స్వీకరించారు. తదుపరి

 

 

Post Midle

శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు.తదుపరి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కుటుంబానికి అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు.  తరువాత శేషవస్త్రాలను, లడ్డుప్రసాదాలను మరియు శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు అందచేశారు.

 

Tags; Governor Vishwa Bhushan Harichandan in the service of Swami Ammavarla

Post Midle