చంద్ర‌ప్రభ వాహనంపై గోవిందరాజస్వామి వైభ‌వం

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం సాయంత్రం గోవిందరాజస్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్  ఎ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్‌   కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌   మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Govindarajaswamy glory on Chandraprabha vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *