చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

Govinduni Raja on a small car

Govinduni Raja on a small car

Date:12/05/2019

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 8.30 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభ‌వంగా జరిగింది.చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

 

 

 

 

 

 

 

శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.హంస వాహనంపై గోవిందుని అభయం హంస వాహనసేవలో శ్రీగోవిందరాజస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.కాగా బ్రహ్మోత్సవాలలో మూడవరోజైన సోమవారం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు సింహవాహనం, రాత్రి 8 నుండి 9.30 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీగోవిందరాజస్వామి వారు ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయ‌ర్ స్వామి,  చిన్న జీయ‌ర్ స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పి.వరలక్ష్మి, ఏఈవో  ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ కృష్ణమూర్తి  త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

 

 

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టిటిడి సారె

Tags: Govinduni Raja on a small car

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *