Natyam ad

నకిలీ సీడ్స్ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

-సీపీఐ జిల్లా నాయకుల డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:


నకిలీ   పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఎకరాకు లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చి సీడ్ కంపెనీ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు  నమోదు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్
చేశారు.బుధవారం నాడు ఓ ప్రకటనలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో నకిలీ సీడ్ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చి కావేరి – బెడర్ – నాన్ బిటి పత్తివిత్తనాల కంపెనీ యాజమాన్యం పై మరియు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న నంద్యాల లో ఓ బడా రాజకీయ నాయకుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి. ఎస్ బాబా ఫక్రుద్దీన్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మికసంఘం. జిల్లా అధ్యక్షుడు ఏ సుబ్బరాయుడు. సిపిఐ గోస్పాడు మండల కార్యదర్శి హరిబాబు. పాణ్యం మండలం  నాయకుడుబాలకృష్ణడిమాండ్ చేశారు.నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం భూపనపాడు కొణిజేడు. గోస్పాడు మండలం ఒంటలగల నంద్యాల మండలం విత్తనాల పుసులూరు గ్రామాలలో నకిలీ సీడ్ పత్తి విత్తనాల వల్ల

 

 

Post Midle

నష్టపోయిన రైతుల పొలాలను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగిందన్నారు .నంద్యాల పార్లమెంటు పరిధిలో కావేరి బిటి రకం  నకిలీ పత్తి  విత్తనాలు వందలాది ఎకరాల్లో రైతులు ఎకరాకు70,000 ఖర్చుపెట్టి వేసిన పంట చేతికి రాక తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వ వ్యవసాయ అధికారులకు. ప్రజాప్రతినిధులకు  తెలియజేసిన ఏ ఒక్కరూ వారిరైతులకు అండ గా నిలచక పోవడం విచారకరము బాధాకరమని అన్నారు.
జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోతున్న రైతులకు వ్యవసాయ అధికారులు జాగ్రత్తలు చెప్పకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లుఉండటం ఏమి పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వెంటనే ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తూ స్వీడ్స్ కంపెనీలపై  క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి ఇంటి ముట్టడించి రైతులకు అండగా నిలుస్తామని పై నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోస్థానిక ఆయా మండలాల సీడ్ కంపెనీ వల్ల నష్టపోయిన రైతులు  పాల్గొన్నారు.

 

Tags: Govt should help the farmers who have lost due to fake seeds cotton seeds

Post Midle