మొబైల్లో ముఖ హాజరు ను ప్రభుత్వం విరమించుకోవాలి.
డోన్ ముచ్చట్లు:
ప్రభుత్వ ఉపాధ్యాయుల కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ ద్వారా ముఖ హాజరు ని డోన్ మండలం లో గల అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్టు ఫ్యాఫ్టో ఉపాధ్యాయ సంఘ చైర్మన్ వెంకట రమణ, కో చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి, ఎన్.ఎస్. బాబు, లక్ష్మయ్య, శివ ప్రసాద్, లక్ష్మి కాంతరెడ్డి, సురేష్, భాను ప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్ రెడ్డి,సుభాన్,షేక్ హుస్సేన్, భాస్కర్, గ్రేసమ్మ, రంగనాథ్, వెంకటేష్, శివుడు, రమేష్, గోవిందరెడ్డి, తదితరులు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్యాప్టో నాయకులు మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ గారికి, ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం లో జయరాం నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట డోన్ నందు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ గారికి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు.అలాగే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, డోన్ ఉపాధ్యాయులు కూడా ప్రధానోపాధ్యాయులు మైమున్నిసాకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వమే నాణ్యమైన పరికరాలు సమకూర్చి దానికి సంబంధించిన సర్వర్ సామర్థ్యం ని పెంచి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని అలా కాకుండా ఇప్పటికే అనేకమైన app లతో విద్యాబోధన కుంటుపడుతున్న సమయంలో ఇంకొక అప్ ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసి బోధన కి దూరం చేయడం సరికాదన్నారు.కావున ప్రభుత్వం తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Tags: Govt should stop face to face attendance on mobile.

