భారత్ లో క్రమేనా తగ్గుతున్న కరోనా కేసులు

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు :

 

ఒకప్పుడు నాలుగు లక్షలకి పైగా నమోదు అయిన కరోనా కేసులు ప్రస్తుతం లక్ష కి వచ్చాయి. అలాగే కరోనా మహమ్మారి మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2427 మంది మృతిచెందారు. దీనితో  ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 349186 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 174399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా  దేశంలో ఇప్పటి వరకు మొత్తం 232786482 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇండియాలో తాజాగా 174399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 27159180కి చేరింది. రికవరీ రేటు 93.7 శాతం నుంచి 93.9 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్లో 1401609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1587589 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 36 కోట్ల 63 లక్షల 34 వేల 111 టెస్టులు చేశారు. కొత్తగా 1390916 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 23కోట్ల 27లక్షల 86వేల 482 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 28909975 కి చేరింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Gradually declining corona cases in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *