భారీ వర్షాలకు కొట్టుకుపోయని ధాన్యం

నిజామాబాద్ ముచ్చట్లు:


ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది.ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షం వరదలో  వరి కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుక పోయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం లోని నిజాంసాగర్,పిట్లం, పెద్ద కొడప్గల్, జుక్కల్,బిచ్కుంద,మద్నూర్ మండలాల్లోని వరి ధాన్యం వర్షం ధాటికి తడిసి ముద్దైంది.రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం కుప్పల్లో వరద నీరు వచ్చి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కొన్ని చోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకపోగా మరికొన్ని చోట్ల కాంట అయిన ధాన్యం బస్తాలు తడిశాయి.దీంతో ఆయ గ్రామాల్లోని రైతులు నష్ట నివారణ చర్యలు చేపడుతు వరి ధాన్యం ను మళ్ళీ ఆరబెట్టుకొంటున్నారు.ఆయితే వర్షం ధాటికి తడిసిన వరి ధాన్యం ను రంగు మారిన వడ్లను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, సొసైటీ లలో రైతుల కోసం అధిక సంఖ్య లో వరి ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్ఫెన్ లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక రైతులు.

 

Tags; Grain not washed away by heavy rains

Leave A Reply

Your email address will not be published.