ధాన్యం కొనుగోళ్లు కష్టమే

విజయవాడ ముచ్చట్లు:

రబీలో ధాన్యం కొనుగోళ్లకు ఆర్ధిక సమస్య వెంటాడుతోరది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత సబ్సిడీ నిధులు రాకపోవడం, అప్పులు చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతుండడం వల్ల రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యానికి నిధుల సమస్య నెలకొంటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వడ్డీలకు ప్రతి నెలా వందలాది కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి కూడా పౌర సరఫరాల సంస్థకు సంకటంగా మారింది. ఈ నేపథ్యరలోనే నిధులిచ్చి ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు 9,530 కోట్ల రూపాయలు అవసరముంటుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. మొత్తం 45 లక్షల మెట్రిక్‌ టన్ను ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. మొత్తం నిధుల అంచనాలో రూ.8,524 కోట్లు నేరుగా రైతులకు చెల్లించాల్సి ఉంటుందని, మరో రూ.300 కోట్లు గోనె సంచుల సమీకరణకు, ధాన్యం సేకరిరచే సంస్థలకు కమిషన్‌గా రూ.140 కోట్లు, రవాణాకు రూ.150 కోట్లు, సార్టెక్స్‌ ఛార్జెస్‌ కింద రూ.210 కోట్లు, మార్కెట్‌ రుసుముగా రూ.85 కోట్లు, స్టోరేజికి రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థకు చెందిన అధికారులు చెబుతున్నారు.

వీటికి తక్షణ నిధులు అవసరమని, మొత్తం అంచనాలో కనీసం ఐదు వేల కోట్లు ముందుగా ఇవ్వాలని ఆ సంస్థ కోరుతోంది. పలు రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యానికి సంబంధించిన నగదును చాలా సంవత్సరాలుగా పౌర సరఫరాల సంస్థకు చెల్లించడం లేదని తెలుస్తోరది. 2017-18 నుంచి కూడా సబ్సిడీ బకాయిలు పేరుకుపోయి ఇప్పటికి 17 వేల కోట్ల రూపాయల వరకు చేరిపోయినట్లు సంస్థ చెబుతోంది. ఈ నిధులు రాకపోవడం వల్ల రైతులకు తాము చెల్లించాల్సిన నగదు కూడా చెల్లించలేకపోతున్నామని, దీంతో రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సంస్థ అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత తరుణంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ నిధులను ఉపయోగించుకుని ముందుకు సాగాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ధాన్యం సేకరణ, ఇతర అవసరాలకు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు గరిష్ట స్థాయికి చేరిపోయాయని, ఈ రుణాలపై ప్రతి నెలా రూ. 175 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి వస్తోందని అధికారులు చెబుతు న్నారు.

ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు, చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ నిలుపు చేయడం కుదరదని, అందుకే తక్షణం నిధులు సమకూర్చాలని సంస్థ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.రైతులకు పౌరసరఫరాల సంస్థ ఎంత బకాయి ఉంది ? ఈ ప్రశ్నకు సంస్థ అధికారులు స్పష్టమైన జవాబు ఇవ్వడం లేదు. అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం జూన్‌ 29 నాటికి రైతులకు రూ.2,882.63కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జూలై 9నాటికి మరో రూ.475.39కోట్లు విలువగల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించింది. సంస్థ ఎండి సూర్యకుమారి కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, వాటి విలువ మాత్రమే చెబుతున్నారు కాని, చెల్లింపులు, బకాయిలు వివరాలపై పెదవి విప్పడం లేదు. రైతులు మాత్రం 1.50 లక్షల మందికి సంబంధించి రూ.2వేల కోట్లు వరకు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తోందని సంస్థ అధికారులే ప్రకటించారు. ఆ మేరకు ప్రతిరోజు నిధులు విడుదల య్యాయా..లేదా అన్నది కూడా సందేహంగా మారింది. విడుదలైతే ఆ మొత్తాన్ని రైతులకు చెల్లిం చారా? ఇతర అవసరాలకు మళ్లించారా..అన్న విషయంపై కూడా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Grain purchases are difficult

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *