ఆర్బీకే ద్వారానే ధాన్యం కొనుగోళ్లు
గుంటూరు ముచ్చట్లు:
రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తామని,కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు.మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరైనా కొనుగోలు చేసినా వారిని ఉపేక్షించబోమన్నారు. గత నెలలో అకాల వర్షాలు కురిసినప్పుడు ధాన్యంలో తేమ శాతం 25కి పైగా ఉండటంతో కొంతమంది రైతులు తక్కువ ధరకే తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేశారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూస్తోన్నామన్నారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఎకరాకు 25 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధన ఏమీ లేదన్నారు.పేదలందరికీ ఇళ్ల లేఅవుట్లు, నిర్మాణాలపై చర్చించారు. కోర్టు కేసులు కారణంగా పట్టాల పంపిణీ నిలిచిన మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని మండలాల్లో అవసరమైన భూమిని వెంటనే సేకరించాలని సభ్యులు కోరారు. టిడ్కో గృహాల వద్ద అవసరమైన మౌలిక సౌకర్యాల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించాలని తెలిపారు. గుంటూరులోని గోరంట్ల కొండపై నిర్మిస్తోన్న రక్షిత నీటి పథకం పనులు కాంట్రాక్టరు వెంటనే పూర్తి చేసేలా చర్యులు తీసుకోవాలని ఆదేశించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Grain purchases through RBK itself