భారీ వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం
యాదాద్రి ముచ్చట్లు:
గుండాల మండల కేంద్రంలో దాన్యం కొనుగోలు సెంటర్ వద్ద ఉన్న వడ్ల రాశులు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సెంటర్ దగ్గర వర్షం రావడంతో వరద తా కిడికి పక్కనే ఉన్న చెరువులోకి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. గుండాల మండలంలో కొన్ని గ్రామాలలో ఐకేపీ, పిఎసిఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంటాలు ప్రారంభించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, నల్ల కవర్లు ,తాటిపత్రులు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయవలసి ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా టార్పాలిన్లు పంపిణీ చేయక పోవడంతో వర్షానికి వడ్ల రాశులు కొట్టుకపోయి నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం రాసులు ఉన్న రైతుల వివరాలు నమోదు చేసుకొని కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Tags; Grain soaked by heavy rain

