Natyam ad

కొత్తపనుల గుర్తింపు కోసమే గ్రామసభలు

చౌడేపల్లె ముచ్చట్లు:


ఉపాధి హామీ పథకంలో కొత్త పనులు గుర్తించి రైతులకు, కూలీలకు, సమాజానికి ఉపయోగపడే పనులను చేపట్టాలని కొండామర్రి సర్పంచ్‌ జయసుధమ్మ తెలిపారు. సోమవారం సచివాలయంలో గ్రామసభ నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన లేబర్‌ బడ్జెట్‌కు అనుగుణంగా కొత్తపనులను ఎంపిక చేయాలని గ్రామ సభ లో తీర్మాణించారు. పంట కాలువల పునరుద్దరణ, చెరువుల్లో పూడికతీత, మామిడి, పూలు, కూరగాయల పంట లసాగు, భూగర్భజల వనరులను పెంపొందించడం, భూ అభివృధ్దిపనులు చేపట్టుకొనే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు ప్రభుత్వ స్థలాల్లో చెట్లు పెంచుకోవచ్చునని సూచించారు. భీడు భూములను సాగుభూములుగా మార్పు చేసుకొనే సౌకర్యం ప్రభుత్వం కల్పించినదన్నారు. వారం రోజులపాటు గ్రామాల్లో సిబ్బంది పర్యటించి చేపట్టబోయే పనుల వివరాలు సేకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని వలంటీర్లు ప్రజలకు తెలిపి లబ్దిపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, టిఏ అమరనాథ్‌,, నేతలు నాగభూషణరెడ్డి, మునిగిరిబాబురెడ్డి,శ్రీనివాసులు, వెంకటరమణ, బాలాజి,రఘునాథరెడ్డి,సుబ్రమణ్యం,తదితరులున్నారు.

 

Tags: Gram sabhas are for recognition of new works

Post Midle
Post Midle