పుంగనూరులో ఘనంగా ఆదివాసిల దినోత్సవ ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
అంతర్జాతీయ ఆదివాసిల దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంఘ నాయకులు ఎం .రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి అతిధులుగా హాజరై తొలుత అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించి , ర్యాలీ నిర్వహించారు. సభలో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లకు మించి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భారతరాష్ట్రపతి ద్రౌపతిముర్ముకు మద్దతు ఇచ్చి ఆదివాసిలకు అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం జరిగింద న్నారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీ కులస్తులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించి, ఎస్టీలను ఆదుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భాస్కర్‌గౌడు, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మంగళం రాజారెడ్డి, ఎస్టీ సంఘ నాయకులు శ్రీనివాసులు, ఎం.బాబు, వై రామకృష్ణ, కృష్ణప్ప, వెంకట్రమణ,శ్రీనాథ్, ఆనంద, రామాంజులు, పురుషోత్తం, ప్రభాకర్, అలివేలమ్మ, నాగరాజ, అమరప్ప, వెంకటస్వామి,శ్రీకాంత్, కేశవప్ప, మంజునాథ్, వై.శ్రీనివాసులు, ఆదెప్ప, రమణ, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand Adivasi Day rally in Punganur
