ఘనంగా  ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతి వేడుకలు

కడప ముచ్చట్లు:


ఆంధ్రప్రదే శ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం  జిల్లా యస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్,  నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం పంతులు  చిత్రపటానికి  ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు  1872 ఆగష్టు 23 న ప్రస్తుత ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో  సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసారన్నారు నిరుపేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన  ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50 లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని ఎస్.పి కొనియాడారు.  మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా వెళ్లి  తన గుండెను చూపించి ‘ఆంధ్ర కేసరి’ అని కీర్తి గడించారని ఎస్.పి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ అదనపు ఎస్.పి మహేష్ కుమార్, ఎ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, ఆర్.ఐ లు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, జార్జ్, సోమశేఖర్ నాయక్, ఆర్.యస్.ఐ లు, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Grand Andhra Kesari Tanguturi Jayanti celebrations

Leave A Reply

Your email address will not be published.