శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా అన్నాభిషేకం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అన్నాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఆ తరువాత ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టి భక్తులకు పంపిణీ చేశారు. శుద్ధి అనంతరం సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసి వేసి ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:Grand Annabhishekam at Sri Kapileswara Temple
