ఘనంగా ఎమ్మెల్యే బలనాగి రెడ్డి జన్మదిన వేడుకలు
తరలి వచ్చిన సర్పంచ్ లు,ఎంపిటిసి లు అభిమానులు
కౌతాళం ముచ్చట్లు:
మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బలనాగి రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం మండల కార్యకర్తలు, నాయకులు వార్డ్ మెంబర్లు, సర్పంచ్ లు,ఎంపీటీసీ మండల నాయకుల ఆదేశాలు మేరకు అశోక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను తరలి వచ్చి రక్తదానం అందించారు. మండల నాయకులు దేశాయి కృష్ణ, ఆధ్వర్యంలో ఎంపిపి, వైస్ ఎంపీపీ డిప్యూటీ, ఆర్ ఐ,ఉన్నత పాఠశాల చైర్మన్ వడ్డే రాముడు,సర్పంచ్ పాల్,బీమా యూత్ అశోక్ వర్డ్ మెంబర్లు సర్పంచ్,ఎంపిటిసిలు తదితరులు జయప్రదం చేశారు.. జన్మదిన సందర్భంగా మండల కార్యాలయంలో శిబిరాలను ఏర్పాట్లు చేయడమైనది అని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది .అని అందరూ మానవత్వం తరలి వచ్చి రక్తదాన శిబిరాలను జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదని కానీ నేడు అన్ని దానాలకంటే ప్రాణదానం ఎంతో మిన్న అని మండల నాయకులు తెలిపారు.

మన ఎమ్మెల్యే ప్రజల మనిషి అని సంక్షేమ నికి పాటుపడే వ్యక్తి అని తెలిపారు. అన్ని విధాల సహాయసహకారాలు అందించే వ్యక్తి మన ఎమ్మెల్యే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం ఇచ్చి మానవత్వం చాటుకోవలని మండల నాయకులు దేశాయి కృష్ణ ఎంపీపీ అమరేషప్ప కోరారు.అనంతరం మండల కార్యాలయంలో కేక్ ను కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీపీ అమరేషప్ప, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి పాల్ దినకర్, తిక్కయ్య, ఎంపిటిసి రాజహమాద్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ రాజశేఖర్, మరియు మండల సర్పంచ్ లు ,ఎంపిటిసి లు సచివాలయం సిబ్బంది కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
Tags: Grand birthday celebrations of MLA Balnagi Reddy
