ఘనంగా భక్త కనకదాస జయంతి వేడుకలు

తిరుపతి ముచ్చట్లు:

భక్త కనక దాసు ఒక గొప్ప భక్తుడు, తత్వవేత్త అని, మహనీయుల జీవితం, వారి అడుగు జాడలు యువత అలవర్చుకోవాలి అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు.తిరుపతి కలెక్టరేట్లో గురువారం ఉదయం మహా భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని జిల్లా బి.సి. వెల్ఫేర్ శాఖ వారి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కే వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కనకదాసు చిత్ర పటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు. కనకదాసు సైనిక కుటుంబంలో జన్మించారని, ఒక గొప్ప సైనికుడిగా విధులు నిర్వహించారని యుద్ధంలో తనకు కలిగిన శారీరిక భాదలు, సంఘటనలు చూసిన తర్వాత మార్పు చెంది ఒక మహాకవిగా మారాడని వివరించారు. కుల, మతాలకు అతీతంగా అందరు సమానమేనని ఎవరికైనా మోక్షాన్ని పొందే అవకాశం ఉందని, గొప్పగా చెప్పిన వ్యక్తులలో కనకదాసు గారు ప్రథమ స్థానంలో ఉన్నారని కొనియాడారు.అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భక్త కనకదాసు కు తిరుపతికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు.కన్నడ లో కవిగా ఉన్నపటికీ ఎక్కువ కాలం తిరుపతిలోనే ఉన్నారని తెలిపారు.

 

 

ఇలాంటి మహానుభావులను తమ జయంతి, వర్దంతిలలో స్మరించుకోవడం వల్ల వారి జీవితాల నుండి మనం స్ఫూర్తిని పొందుతామని అన్నారు. కురబ సంఘ నాయకులు జయప్ప మాట్లాడుతూ మహనీయుల జీవితాల గురించి పిల్లలకు  కూడా తెలియజేయ గలిగితే వారు చిన్న వయస్సు నుండి స్పూర్తిని పొంది చైతన్య వంతులుగా ఎదుగుతారని తెలియజేశారు. కనకదాసు తన జీవితంలో ఎంతో నిక్ఖచిగా జీవించేవారని, ఎంతో ధైర్యంతో,  ప్రశ్నించే తత్వంతో ఉండేవారని అదే స్పూర్తి మనం మన పిల్లలకు నేర్పించాలని అన్నారు.

 

 

Post Midle

డిసెంబర్ నెలలో జరగనున్న  కుల గణనలో అందరు తమ ఉప కుల వివరాలను  నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. . కురువ సంఘం వారు తిరుపతి నందు కనకదాస భవన నిర్మాణానికి స్థలం కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని  ఇతర వినతి పత్రాలను పరిశీలించి  ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి. వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, కురువ సంఘ నాయకులు నంజుండప్ప, వెంకట నారాయణ, రమణ, రెడ్డి కుమార్, మంగిరి రెడ్డప్ప, రామచంద్ర, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది, అధికారులు  పాల్గొన్నారు.

 

Tags: Grand celebration of Bhakta Kanakadasa’s birth anniversary

Post Midle