ఘనంగా పోనియా గాంధీ జప్మదిన వేడుకలు
కాసీపేట ముచ్చట్లు:
కాసిపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమగూడెం చౌరస్తా లో 60 ఏండ్ల తెలంగాణ సాకార పూర్తి ప్రదాత సోనియా గాంధీ గారి 77 పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ ఇలాంటి నాయకురాలు ప్రధానమంత్రి అయితే భావితరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భవిష్యత్తు ఎన్నికల్లో తెలంగాణలో సోనియామ్మ రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ అండగా ఉండాలని, దేశంలో, రాష్ట్రంలో ఈ మోసపూరిత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు ఆటో యూనియన్ అధ్యక్షుడు దూడం మహేష్ కాంగ్రెస్ నాయకులు ఉపసర్పంచ్ సోమగూడెం ( కె )కనుకుల రాకేష్, మాజీ సర్పంచ్ కాపురపు శ్రీనివాస్, పెద్దన్నపెల్లి వార్డు సభ్యులు కొత్త రమేష్ , సీనియర్ నాయకులు కూకట్ల దేవేందర్,తోట సురేష్,ఎగ్గే రాకేష్, చిలుముల శ్రీనివాస్,సురేష్,కాంగ్రెస్ అభిమానులు ,ఆటో యూనియన్ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: Grand celebration of Ponia Gandhi Japmadi

