పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గురువారం కోర్టు ఆవరణంలో న్యాయమూర్తి శిరీష్ , న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులు , న్యాయవాదులు, సిబ్బంది కలసి పతాకావిష్కరణ చేశారు. అలాగే మున్సిపాలిటిలో కమిషనర్ నరసింహప్రసాద్ జెండాను ఎగురవేసి, గాంధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పతాకావిష్కరణ చేశారు . అలాగే రహమత్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ జెండా ఆవిష్కరణ చేశారు. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేసి, కళాశాలలో ఉప్పుతో విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ బొమ్మలను ఏర్పాటు చేశారు విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, మునస్వామి మొదలియార్ లు పతాకావిష్కరణ చేశారు. కల్లూరు జెడ్పి హైస్కూల్‌లో హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేశారు. పట్టణంలోని ఎంబిటి రోడ్డులో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి, తహాశీల్ధార్ రాము లు పతాకాన్ని ఎగురవేశారు. అలాగే ఎగ్జిబిషన్ వారికి రూ.3 వేలు ఆర్థిక సహాయం అందించారు. బాష్యం స్కూల్‌లో హెచ్‌ఎం సుబ్రమణ్యం, ఎస్‌ఐ సుబ్బారెడ్డి లు పతాకావిష్కరణ చేశారు. వృధ్దాశ్రమంలో రాయల పీపుల్‌ఫ్రంట్ ప్రతినిధులు హేమంత్‌రాయల్, రెడ్డిప్రసాద్‌రాయల్, రాఘవరాయల్, పరమేష్‌రాయల్, మల్లిక రాయల్ కలసి అన్నదానం చేశారు. వెహోక్కలు నాటారు. వృద్ధులతో కలసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పతాకావిష్కరణ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సివి.రెడ్డి, గిరి, నరేంద్ర, మాధవరెడ్డి , ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Grand Independence Day celebrations in Punganur