– ముఖ్య అతిథులుగా హాజరై కవాతును.. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.
– భారత జాతీయ జెండాకు గౌరవ వందనం ఇవ్వడం ఎన్నో జన్మల పుణ్యము.
– స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం.
తిరుపతి ముచ్చట్లు:
బుధవారం నాడు ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీస్ కవాతు రిహార్సల్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్., ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా ఎస్పీ తో పాటు జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం చేశారు.అందమైన పోలీస్ కవాతులో ఏ.ఆర్, సివిల్, స్పెషల్ పార్టీ, ట్రాఫిక్ పోలీసు, హోంగార్డ్స్, ఎన్సిసి క్యాడేట్స్, స్కౌట్స్ కు చెందిన 8 కాంటింజెంట్లు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., పోలీసు కవాతులో పాల్గొన్న పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే.. ఈరోజు భారత జాతీయ జెండాకు గౌరవ వందనం ఇచ్చే అదృష్టం మీకు మాత్రమే కలిగిందంటూ నూతన ఉత్సాహాన్ని నింపి ప్రోత్సహించారు.విద్యార్థులు, ప్రజలలో దేశభక్తిని, జాతీయతా భావాన్ని కలిగించే సత్తా కవాతుకే ఉంది అని అభిప్రాయపడ్డారు. మనకోసం మన భద్రత కోసం పోలీసులు, మిలటరీ వాళ్లు ఇంతలా శ్రమిస్తున్నందువలనే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నామనే భావాన్ని ప్రజలకు కలుగజేయడం ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.సమిష్టి బృందముగా ఏర్పడి కష్టపడి పని చేయడం వలన ఎలాంటి అద్భుతాలను సాధించవచ్చునో ఈ పోలీస్ కవాతును చూసి విద్యార్థులు, పిల్లలు నేర్చుకునే అవకాశం ఉన్నది. కావున రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ కవాతులో మరింత నూతన ఉత్సాహంతో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
పోలీస్ పెరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, శకటాల ప్రదర్శన సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనే అవకాశం ఉంది. తదునుగుణంగా తీసుకోవాల్సిన భద్రత ట్రాఫిక్ నియంత్రణ చర్యలను గురించి పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., దిశా నిర్దేశం చేశారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్., పోలీసు పెరేడ్ మైదానం వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఐఏఎస్., తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్., అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, విమల కుమారి నేర విభాగం, రాజేంద్ర సెబ్, శ్రీనివాసరావు ఎ.ఆర్, డిఎస్పిలు రవీంద్రారెడ్డి, రమణయ్య, చిరంజీవి సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Grand Independence Day Rehearsal Celebrations.