పుంగనూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ యాదవ్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు పట్టణ సమీపంలోని కృష్ణమరెడ్డిపల్లె వద్ద గల శ్రీకృష్ణాలయంలో ఘనంగా నిర్వహించారు. పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యయాదవ్‌ ఆధ్వర్యంలో యాదవ కుటుంబ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. హరేకృష్ణ…హరేకృష్ణ అంటు భక్తుల నినాదాలతో ఆప్రాంతం భక్తిపారవశ్యమైంది. యాదవ సంఘ సభ్యులు పట్టణంలో చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణలతో, పిల్లనగ్రోవి నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుదంరంగా అలంకరించి పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.

 

Tags: Grand Krishnashtami celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.