చెన్నైలో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం
– శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు
తిరుపతి ముచ్చట్లు:
చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది.ఇందులో భాగంగా ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కుంభ ఉద్వాసన, కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి జరిగింది.అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

Tags; Grand Kumbhabhishekam of Sri Padmavati Goddess Temple in Chennai
