ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

-మండలి చైర్మన్ కు  రాజీనామా లేఖను పంపించిన ఎమ్మెల్సీ పోతుల సునీత

Date:28/10/2020

విజయవాడ  ముచ్చట్లు:

గత 15 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు అడ్డుకుంటున్నారు. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది. దీనికి నిరసనగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నాను.  నా రాజీనామా లేఖను ఆమోదించగలరు అని రాజీనామా లేఖలో ఎమ్మెల్సీ సునీత ఈ విధంగా పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Tags: Granddaughter Sunita resigns from the post of MLC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *