ఆత్మకూరు అభివృద్ధికి నిధులు మంజూరు

Date:06/10/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలులో మేజర్ పట్టణాల్లో ఆత్మకూరు ఒకటి. ఆత్మకూరు కార్పోరేషన్‌గా మారినా అభివృద్ధిలో మాత్రం అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితి. పలు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు అధ్వాన్నంగా ఉన్న దుస్థితి. వర్షం వస్తే కొన్ని వీధుల్లో నడక, ప్రయాణం నరకప్రాయమే. బీటీ రోడ్లపై రాళ్లు తేలటం, గుంతలు పడటంతో పాదాచారులు, వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు.
అడపాదడపా గాయాలపాలవుతున్నారు. అర్బన్‌ కాలనీ, వెంగళరెడ్డి నగర్‌, గరీబ్‌ నగర్‌, రహమ్మత్‌ నగర్‌లలో సరైన రోడ్లు లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. ఆళ్లగడ్డలో గీతా వీధి నుంచి బృందావనం వెళ్లే మార్గంలో రోడ్డు సరిగా లేదు. ఇక చింతకుంటలో అయితే అంతర్గత రహదారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక్కడి రోడ్లు ఘోరంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్ల పరిస్థితి చూస్తే ఎవ్వరైనా అదే మాట అంటారు.
శేషశయనారెడ్డి కాలనీ, బీసీ కాలనీ. నందికొట్కూరు పురపాలికలో బైరెడ్డినగర్‌, మారుతీనగర్‌ల్లోనూ రోడ్ల సమస్య ఉంది. గూడూరు నగర పంచాయతీ పరిధిలో అయితే మట్టి రోడ్లే ఉన్నాయి. తేరు వీధిలోనూ రోడ్ సరిగా లేదు. మొత్తంగా పురపాలికలు, నగర పంచాయతీల పరిధిలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్ల అభివృద్ధికి నిధులు కావాలంటూ అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. వారి కృషి ఫలించి ప్రభుత్వ రూ.736.20కోట్లు కేటాయించింది.
ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆత్మకూరుకు కేటాయించిన నిధులతో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. రహదారులు పునరుద్ధరణతో పాటూ కొత్త రోడ్లు వేయనున్నారు. డ్రైనేజ్‌ వ్యవస్థనూ సరిచేయనున్నారు. ఇక పార్కుల ఏర్పాటూ ఉంటుందని అధికారులు అంటున్నారు. మొత్తంగా ఆత్మకూరును పట్టి పీడిస్తున్న వివిధ సమస్యలకు చెక్ పెట్టేందుకు సంబంధిత అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎక్కడెక్కడ పనులు సాగించాలో నిర్ణయించారు. టెండర్లు వేయాల్సి ఉంది. టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నారు అధికారులు. ఇదిలాఉంటే అభివృద్ధి పనులు సంక్రమంగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో చేతులు దులుపుకోకుండా అధికారులు పనులపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ప్రభుత్వం అందించిన నిధులతో పటిష్టమైన పనులు సాగించాలని.. పట్టణాన్ని వేధిస్తున్న వివిధ సమస్యలకు తెరపడాలని అంతా కోరుకుంటున్నారు.
Tags: Grant funds for the development of the soul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *