Natyam ad

కార్పెంటర్స్ కు ముద్ర లోన్ రుణాల మంజూరు

విశాఖపట్నం  ముచ్చట్లు:

;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ముద్ర లోన్ స్వర్ణకారులకు అందజేసి వారి అభివృద్ధికి బాటలు పరిచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో విశాఖ జోన్ లోని కార్పెంటర్స్ సోదరులకు రుణాల మంజూరు కొరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి వేణుమాధవ్ ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల కన్నా ప్రసాద్ విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ముదపాక రవి ప్రధాన కార్యదర్శి పెదపూడి బ్రహ్మాజీ కోశాధికారి ఈర్ని ప్రకాష్ కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోనల్ మేనేజర్ ఎం శుభకర్ గారిని డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ జేజీశ్వరరావు గారితో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై లోన్లు ఇచ్చే విధానంలో కార్పెంటర్ సోదరుల అభివృద్ధి కొరకు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని జోనల్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ విశాఖపట్నం ఎం శుభకర్ యూనియన్ నాయకులతో ముచ్చటించి అనేక సూచనలు చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ జేజిశ్వరరావుగారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముద్ర లోన్లు చేతివృత్తుల వారికి అభివృద్ధికి బాటలు వేస్తాయని వీటిని ఉపయోగించుకొని ఈ కుటుంబాలు ఆర్థికంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ బొబ్బిలి వీణ తయారీ కేంద్రంలో సొసైటీ ద్వారా రిజిస్టర్ అయి ఉన్నా ప్రతి వారికి 3 నుంచి 5 లక్షల వరకు వరకు లోన్లు ఇచ్చే విధంగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ నెలలో చేపడతామని మిగతా కార్పెంటర్స్ సోదరులకు విధివిధానాలు పూర్తిగా అందుబాటులో తీసుకువచ్చి బ్యాంకు వారిని సంప్రదిస్తామని తెలియజేశారు భవిష్యత్తులో చతుర్థి అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటుచేసిన ముద్ర లోన్ ద్వారా ప్రతి కుటుంబ అభివృద్ధిలోకి రావాలని ప్రైవేటు వడ్డీలకి బాధలు పడకుండా ప్రతి కార్పెంటర్ కుటుంబం అభివృద్ధి వచ్చేలాగా రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు నెలల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.

 

Tags;Grant of mudra loan loans to carpenters

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.