జినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుమతులు మంజూరు

Date:23/02/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌ చుట్టూ మరో రింగ్ రోడ్డు రానుంది. చౌటుప్పల్, సంగారెడ్డి తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి  తెలిపారు. కిషన్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ నేతల బృందం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసింది. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్‌ ఛేంజర్‌ కానుందని.. ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండు పార్ట్‌లుగా నిర్వహించబోతోంది. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్‌ గడ్కరీకి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త రింగ్ రోడ్డు విశేషాలు తెలుసుకుందాం..హైదరాబాద్ చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్డు నగర ముఖచిత్రాన్ని మార్చేసింది. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం అనంతరం భాగ్యనగరం వేగంగా విస్తరించింది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి, శివారు ప్రాంతాలను వేగంగా చేరుకోవడానికి ఈ రింగ్ రోడ్డు ఎంతగానో తోడ్పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నివాస స్థలాలు ఈ రింగ్ రోడ్డును దాటి విస్తరిస్తుండటంతో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ మరో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. దీన్ని రీజినల్ రింగ్ రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.

 

 

హైదరాబాద్‌ నగరానికి 50 నుంచి 70 కి.మీ. దూరంలో ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) 30 నుంచి 40 కి.మీ. దూరంలో ఉండనుంది.కొత్త రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ 20కి పైగా ముఖ్య పట్టణాలను కలుపుతూ వెళుతుంది.తెలంగాణలోని 40 శాతం మంది ప్రజలకు ఈ కొత్త రింగ్‌ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.హైదరాబాద్‌కు వచ్చే అన్ని ప్రధాన హైవేలు, జాతీయ రహదారులను కలుపుతూ ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది.రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.రెండు దశల్లో నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.మొదటి దశలో భాగంగా సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 158 కి.మీ. మేర రింగ్ రోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి రూ.9,522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో భాగంగా చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి మధ్య 182 కి.మీ. మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Grant of permits for the Jingle Ring Road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *