పుంగనూరులో పాడి రైతులకు గడ్డికత్తరించే యంత్రాలు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పాడి రైతులు ఇబ్బందులు పడకుండ పశువులకు గడ్డిని కత్తరించే యంత్రాలను సబ్సిడిపై పంపిణీ చేస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం పశువైద్యకేంద్రంలో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ మనోహర్ , వ్యవసాయశాఖ ఏడి శివ ఆధ్వర్యంలో 17 మంది రైతులకు రూ.34 వేలు విలువ చేసే యంత్రాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఒకొక్క రైతుకు రూ.13,600 లు సబ్సిడి మంజూరు చేసిందన్నారు. మిగిలినది పాడి రైతు చెల్లించి తీసుకోవాలన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడప గ డపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడి రైతుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అవసరమైన రైతులందరికి యంత్రాలను అందించేందుకు నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరి, డాక్టర్ కళ్యాణ్, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రమణ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: Grass cutting machines for dairy farmers in Punganur – MPP Bhaskar Reddy
