Natyam ad

గడ్డి ట్రాక్టర్ దగ్ధం

రామచంద్రపురం ముచ్చట్లు:


కోనసీమ జిల్లా కే గంగవరం మండలం దంగేరు  గ్రామ శివారు కూలిమిల్లిపాడు గ్రామంలో శనివారం సంభవించిన అగ్నిప్రమాదంలో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది .నాలుగు టన్నుల బరువు గల గడ్డితో వస్తున్న ట్రాక్టర్ ట్రక్కు పైభాగాన 33 కెవి విద్యుత్తు వైర్లు గడ్డి పైభాగాన తాకడంతో వచ్చిన నిప్పు రవ్వ లకు మంటలు వ్యాపించి గడ్డి పూర్తిగా ఖాళీ బూడిదవడమే కాక ట్రాక్టర్ ట్రక్కుకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్  కొప్పిశెట్టి వెంకటరమణ, ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్ సంఘటన స్థానానికి చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు. రామచంద్రపురం నుండి వచ్చిన అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకునే లోపు చాలావరకు గడ్డి పూర్తిగా కాలి బూడిదయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు .ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు వైర్లు కిందికి వేలాడటం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తక్షణం విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Tags: Grass tractor fire

Post Midle
Post Midle