Grasshopper tension in Anantapur

అనంతపురంలో మిడతలు టెన్షన్

Date:30/05/2020

అనంతపురం ముచ్చట్లు:

మిడతల దండు ఇప్పుడు భారతదేశాన్ని భయపెడుతోంది. ఒక్కసారిగా వచ్చి పడిపోయి పంటనంతా నాశనం చేసి వెళ్లిపోతాయి. గుజరాత్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల ద్వారా ఇప్పటికే భారత్‌ దేశంలోకి ప్రవేశించి..వచ్చిన వెంటనే లక్షన్నర ఎకరాల్లో పంటను తినేశాయిఅనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గం, గోరంట్ల ప్రాంతాల్లో గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో మిడతలు గుంపు కలకలం సృష్టించింది. రాయదుర్గం పట్టణం సమీపంలోని దాసప్పరొడ్డు పక్కనున్న జిల్లేడు చెట్టు ఆకులను మొత్తం తినేశాయి. ఇదే రకంగా గోరంట్ల మండలంలోని చౌడేశ్వరీ కాలనీ సమీపంలోని జిల్లేడు చెట్టుపై పెద్దఎత్తున మిడతలు వాలి మొడుగా మిగిల్చాయి. మిడతల సమూహంపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మిడతలు ఇక్కడికి చేరుకున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే వ్యవసాయాధికారులు ఈ విషయాన్ని కొట్టేశారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఆశించిన మిడత రకానికి వీటికి ఎటువంటి సంబంధం లేదని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు హబీబ్‌ బాషా తెలిపారు.

 

 

 

ఇవి స్థానికంగా ఉండే మిడతలేనని వీటి శాస్త్రీయ నామం ‘పోయికిలోసెర్స్‌ పిక్టస్‌’ అని తెలిపారు. ఇవి జిల్లేడు మొక్కలపై మాత్రమే తన జీవిత కాలం పూర్తి చేసుకుంటుందని, వ్యవసాయ, ఉద్యాన పంటలను ఆశించదన్నారు. అక్కడ నుంచి ఉత్తర భారత దేశంవైపుగా వెళ్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గాలివాటంవైపుగా ప్రయాణించే మిడతలు…ఒక వేళ గాలి దక్షిణంవైపుకు వీస్తే మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌ఘడ్‌ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ దక్షిణంవైపు గాలీ వీచే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని…తెలుగు రాష్ట్రాలు అంత భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మిడతల దండు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. తెలంగాణా సరిహద్దు ప్రాంతంలో హెలికాఫ్టర్‌ను పెట్టి పర్యవేక్షణ చేస్తోంది. మిడతల దండు వస్తున్నదని గమనిస్తే క్రిమి సంహారక మందు పిచికారి చేసి వాటిని తరిమికొట్టాలని భావిస్తోంది. సరిహద్దుల్లో 12 ఫైర్‌ఇంజినట్లు, 12 జెట్టింగ్‌ మిషన్లను సిద్దం చేస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో 15వేల లీటర్ల క్రిమి సంహారక మందును సిద్దం చేస్తోంది.రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ మిడతలను పరిశీలించి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న మిడతలు కావని తేల్చి చెప్పారు.

యరపతినేనికి కలిసొస్తున్న కాలం

Tags: Grasshopper tension in Anantapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *